విశాల్ కూడా వచ్చేస్తున్నాడు..!

తెలుగు కుర్రాడే అయినా తమిళంలో సత్తా చాటుతున్న విశాల్ ఇప్పుదు తెలుగు మార్కెట్ మీద కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తమిళ సినిమాలతోనే ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. శ్రీవాస్ డైరక్షన్లో తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. తన కమర్షియల్ ఎంటర్టైన్ సినిమాలతో ఫ్యాన్స్ ను ఉత్తూతలూగిస్తున్న విశాల్ డైరెక్ట్ తెలుగు సినిమా అంటే తెలుగు సిని అభిమానులకు గుడ్ న్యూస్ అన్నట్టే.

తెలుగులో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్ విశాల్ తో తెలుగు స్ట్రైట్ సినిమా చేయబోతున్నారు. అయితే ఇదే సినిమాతో తన తమిళ తొలి తమిళ సినిమా చేయబోతున్నాడు డైరక్టర్ శ్రీవాస్. ఎప్పటినుండో తెలుగు డైరెక్ట్ సినిమా చేద్దామనుకుంటున్న విశాల్ కు ఇప్పటికి ఆ టైం కుదిరింది. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న విశాల్ ఇప్పుడు మరింత దగ్గరయ్యేందుకు వస్తున్నాడు.

ఇప్పటికే తమిళ మార్కెట్ మీద మన హీరోలు మహేష్ మురుగదాస్ సినిమాతో.. అల్లు అర్జున్ లింగుసామి సినిమాతో టార్గెట్ పెట్టగా ఇప్పుడు అక్కడ హీరోలు కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలతో వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.