ఇంప్రెసివ్ నందిని నర్సింగ్ హోం టీజర్..!

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నందిని నర్సింగ్ హోం.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అమ్మాయిలు సముద్రం లాంటోళ్లు అంటూ నవీన్ తన ఫస్ట్ డైలాగ్ అదరగొట్టేశాడు. ఘట్టమనేని ఫ్యామిలీ సపోర్ట్ తో వస్తున్న ఈ కుర్రాడు మహేష్ బాబు కూడా బెస్ట్ విశెష్ అందించాడు. నరేష్ ఎంత మంచి నటుడో అందరికి తెలిసిందే. ఇక తన తనయుడు అరంగేట్రానికి కారణం కూడా తనే అయ్యాడు.  

తనయుడిలోని ఇంట్రెస్ట్ ను గమనించి హీరోగా ఎంట్రీ ఇప్పించే ఏర్పాటుచేశాడు. ఇక ఈ మధ్య నరేష్ కూడా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పివి గిరి గిరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ అవనుంది. ఇక ఈ ఆడియోకి సూపర్ స్టార్ మహేష్ ను చీఫ్ గెస్ట్ గా పిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఘట్టమనేని సపోర్ట్ తో సుధీర్ బాబు కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంటే ఇప్పుడు నవీన్ విజయ కృష్ణ కూడా ఆ ఫ్యామిలీ హీరోల జాబితాలో చేరి ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు వస్తున్నాడు.

మరి టీజర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. నవీన్ విజయకృష్ణ, నిత్యా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను భిక్షమయ్య, రాధా కిశోర్ కలిసి నిర్మిస్తున్నారు.