
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా టైటిల్ గా ఎప్పటినుండో రకరాకలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి అయితే ఎక్స్ క్లూజివ్ గా చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ 'శివ' లేదా 'అభిమన్యుడు' అని గాని పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇంతకుముందు అనుకున్నట్టుగా తెలుగు తమిళ భాషలకు ఓకే టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రెండు టైటిల్స్ పరిగణలో తీసుకున్నారట.
ఫైనల్ టైటిల్ మాత్రం ఈ రెండిటిలో ఒకటి అవుతుందని అంటున్నారు. సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్ చేస్తుండగా ఇదవరకు ఎన్నడు చూడని విధంగా మహేష్ ను చూస్తారని అంటున్నారు. చెన్నై లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్ అక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మళ్లీ హైదరాబాద్ లో మరో షెడ్యూల్ షూట్ చేయనుందట. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో సూపర్ హిట్ చేసే దిశగా కష్టపడుతున్నాడు మహేష్.
ఇక మురుగదాస్ తో సినిమా పూర్తి కాగానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరోసారి కొరటాల శివతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు మహేష్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. సో మరి ఈ హిట్ కాంబినేషన్ మరోసారి ఎలాంటి సినిమాతో వస్తుందో చూడాలి.