
రామ్ 19వ సినిమా లింగుసామి డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ మాస్ డైరక్టర్ లింగుసామి, రామ్ కాంబినేషన్ లో మాస్ మూవీగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమాలో విలన్ గా ఆర్య నటిస్తాడని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఆర్య ప్లేస్ లో ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడని అంటున్నారు. ఆర్య, ఆది ఇద్దరిలో ఎవర్ విలన్ అన్నది చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది.
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో రామ్ మంచి ఫాం లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు లింగుసామి డైరక్షన్ సినిమాతో కూడా రామ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని టాక్.