కృతి శెట్టి డిమాండ్ అలా ఉంది..!

ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి రాం, లింగుసామి కాంబో సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాలతో పాటుగా కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమాలో కూడా కృతి శెట్టిని తీసుకోవాలని చూస్తున్నారట. ముందు డేట్స్ అడ్జెస్ట్ కావని చెప్పినా సరే ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ ఇస్తేనే ఆ సినిమాలో చేస్తానని అంటుందట. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని తెలిసిందే. చైతుకి జోడీగా కృతి శెట్టిని తీసుకోవాలని చూస్తున్నారు కాని అమ్మడు మాత్రం రెమ్యునరేషన్ భారీగా అడిగి షాక్ ఇచ్చిందట. 

బంగార్రాజు సినిమాకు కృతి శెట్టి 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్. ఉప్పెన సినిమాకు 10 లక్షల లోపే రెమ్యునరేషన్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీతో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ల సరసన చేరిన కృతి శెట్టి వారికి ఈక్వల్ గా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.