
హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్న నాని ఇప్పటికే అ!, హిట్ సినిమాలతో మంచి ఫలితాలను అందుకున్నాడు. లేటెస్ట్ గా నాని నిర్మాణంలో థర్డ్ మూవీ మీట్ క్యూట్ కూడా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాను నాని సిస్టర్ దీప్తి గంటా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని టాక్. ఇదే కాకుండా నాని నిర్మాతగా మరో సినిమా కూడా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది.
నూతన దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన నాని ఆ సినిమాలో సమంతని తీసుకోవాలని చూస్తున్నారట. పెళ్లి తర్వాత చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్న సమంత నాని సినిమాకు ఓకే చెబుతుందో లేదో చూడాలి. నాని మాత్రం సమంతని ఎలాగైనా ఒప్పించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నాని కూడా నటిస్తాడని టాక్. నాని నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సమంత నటిస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.