KGF 2 టీజర్ సరికొత్త రికార్డ్..!

కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కాకుండానే రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా టీజర్ మరో అరుదైన రికార్డ్ అందుకుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ 200 మిలియన్ వ్యూస్ తో అదిరిపోయే రికార్డ్ సృష్టించింద్ది. అంతేకాదు 8.4 మిలియన్ లైక్స్ తో టీజర్ సెన్సేషనల్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ అంచనాలకు తగినట్టుగానే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వస్తుంది.

ఈ సినిమా టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. కె.జి.ఎఫ్ చాప్ట 2 లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారు. జనవరి 7 న రిలీజైన ఈ టీజర్ 200 మిలియన్ వ్యూస్ తో హంగామా సృష్టిస్తుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే జూలై 16న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా వాయిదా పడ్డది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది చిత్రయూనిట్ నుండి ఎనౌన్స్ మెంట్ రాలేదు.