టక్ జగదీష్ నిర్మాతల క్లారిటీ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాగు గారపాటి ఈ సినిమా నిర్మించారు. సినిమాలో నానికి జోడీగా రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. ఏప్రిల్ 23న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే టక్ జగదీష్ ఈ నెల 30న రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిపై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. టక్ జగదీష్ రిలీజ్ విషయం పై వస్తున్న వార్తలు నిజం కాదని అఫీషియల్ రిలీజ్ డేట్ తాము ప్రకటిస్తామని చెప్పారు చిత్రయూనిట్.

ప్రస్తుతం థియేటర్లు తెరచుకోడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎలాగు సినిమాలు లేవని థియేటర్లు తెరవట్లేదు. అంతేకాదు మళ్లీ థర్డ్ వేవ్ అని భయపెడుతున్నారు కాబట్టి థియేటర్లు రీ ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి సినిమాలన్ని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాను మాత్రం అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు రాజమౌళి.