
యువ హీరో శర్వానంద్, శ్రీ కార్తిక్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకే ఒక జీవితం. సినిమాలో శర్వానంద్ కు జోడీగా రీతు వర్మ నటిస్తుంది. సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే హీరో తల్లి పాత్రలో అక్కినేని అమల నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాతో పాటుగా అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం సినిమాలో కూడా నటిస్తున్నారు శర్వానంద్. ఆ సినిమాలో సిద్ధార్థ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఇదేకాకుండా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ తో రష్మిక మందన్న జోడీ కడుతుంది. ఈ మూడు సినిమాలతో శర్వానంద్ ఎలాగైనా కెరియర్ ట్రాక్ లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు.