
సోషల్ మీడియాలో తనపై వస్తున్న రకరకాల వార్తలపై స్పందిచారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణ పూర్తి. తాను ఆర్ధికంగా చితికిపోయానని.. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక హైదరాబాద్ శివార్లలో అద్దె ఇంట్లొ ఉంటున్నానని.. రెంట్ కట్టేందుకు కూడా కష్టాలు పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు ఆర్. నారాయణ మూర్తి. స్వేచ్చగా ఉండేందుకే తాను నగర శివార్లలో ఉంటునననని.. సిటీలో ప్రయాణించడానికి ఆటోకి రోజుకి వెయ్యి రూపాయలు అవుతున్నాయని.. ఆ రకంగా ఆటోకి 30 వేలు ఖర్చు చేస్తానని అన్నారు. ప్రభుత్వ అధికారులు కొందరు గతంలో ఇల్లు ఇస్తానని చెప్పినా తాను తీసుకోలేదని చెప్పారు.
తన ఆర్ధిక పరిస్థితి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తన మనసుకు బాధ కలిగిస్తున్నాయని దయచేసి అలాంటి వాటిని ప్రచారం చేయొద్దని కోరారు ఆర్. నారాయణ మూర్తి. గతంలో తాను సూపర్ హిట్ సినిమాలను నిర్మించానని. అవసరం అయితే తనకు సాయం చేసే స్నేహితులు ఉన్నారని.. వారిని ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు నారాయణ మూర్తి. ఈమధ్య జరిగిన రైతన్న ప్రివ్యూ సందర్భంగా గద్దర్ తన మీద అభిమానంతో మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని వార్తలు రాస్తున్నారని.. చిన్నప్పటి నుండి చాప మీద పడుకున్నాను ఇప్పటికీ అంతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా రిచ్ అని అన్నారు కాని తాను చాలా రిచ్ అని అన్నారు నారాయణ మూర్తి.