
అల్లు ఫ్యామిలీ నుండి నెక్స్ట్ జెరఏషన్ స్టార్స్ తెరంగేట్రం చేస్తున్నారు. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఆ చిన్నారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ నటిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటిస్తుందని తెలుస్తుంది. దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. సినిమాలో అల్లు అర్హ నటించడం పట్ల అల్లు ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.
గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో మెప్పించాడు అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమాకు మాస్ అప్పీల్ తెచ్చిన ఆ పాత్రలో బన్నీ అదరగొట్టాడు. అందుకే ఆ కృతజ్ఞతతో శాకుంతలంలో చిన్న పాత్ర ఉందని చెప్పగానే తన కూతురితో నటింప చేయిస్తున్నాడు అల్లు అర్జున్.