ఎన్టీఆర్ కి గెస్ట్ అవుతున్న చరణ్..!

సినిమాల్లోనే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా అలరించడానికి నేనెప్పుడూ రెడీ అంటుంటారు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఆల్రెడీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన తారక్ లేటెస్ట్ గా జెమిని టీవీలో రాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో హోస్ట్ చేస్తున్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షోలో మొదటి ఎపిసోడ్ సెలబ్రిటీ గెస్ట్ వస్తారని తెలుస్తుంది. అది కూడా తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న మరో సూపర్ హీరో రాం చరణ్ వస్తున్నారని టాక్.

చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాములుగానే మంచి స్నేహితులైన వీరు ట్రిపుల్ ఆర్ కోసం ఒక్కటవుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్.టి.ఆర్ కు మొదటి గెస్ట్ గా చరణ్ వచ్చి సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఇద్దరు స్టార్స్ బుల్లితెర మీద చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.