'మా' ఎలక్షన్స్ బాలయ్య మార్క్ పంచ్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మొదటిసారి స్పందించారి నందమూరి బాలకృష్ణ. మా అసోసియేషన్ బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు బిల్డింగ్ కోసం ఒక ఎకరం భూమి సాధించలేరా అని అన్నారు. మా బిల్డింగ్ కోసం నిధుల సేకరణ అంటూ ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లో అమెరికాకు వెళ్లిన సభ్యులు ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేశారని అన్నారు. 

మా బిల్డింగ్ కోసం అందరు సహకరించాలని చెప్పిన ఆయన మంచు విష్ణు తో తాను కూడా మా బిల్డింగ్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని అన్నారు బాలకృష్ణ. ఇక లోకల్ నాన్ లోకల్ అంశంపై ప్రస్థావిస్తూ అలాంటివి తాను ఏమాత్రం పట్టించుకోనని చెప్పారు. మొత్తానికి మా ఎలక్షన్స్ పై తన మార్క్ పంచులు వేస్తూనే చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు బాలకృష్ణ.