
నందమూరి బాలకృష్ణ వందవ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన చక్రవర్తి శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా గురించి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ కు సినిమా టైటిల్ సాంగ్ లీక్ ఓ పెద్ద సంచలనం రేపుతుంది.
ఇప్పటికే బాలీవుడ్లో సినిమాలే రిలీజ్ కు ముందు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో కొన్ని తెలుగు సినిమాల సీన్స్ సాంగ్స్ లీక్ బాట పట్టాయి.. క్రిష్ డైరక్షన్లో చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లీక్ అయ్యింది. మరి ఇది ఎవరు లీక్ చేశారో తెలియదు కాని లీక్ అయిన సాంగ్ మాత్రం అంచనాలను అందుకునేలా సూపర్బ్ గా ఉంది.