రామ్ సెట్స్ లో అనుకోని అతిథి..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. జూలై 12న సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు అనుకోని అతిథి వచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఇంతకీ రామ్  సెట్స్ కు వచ్చిన ఆ అతిథి ఎవరు అంటే సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ అని తెలుస్తుంది. రాం చరణ్ తో తీసే సినిమా కోసం డిస్కషన్స్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు శంకర్ ఈ క్రమంలో దగ్గర్లోనే రామ్, లింగుసామి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడకు వెళ్లారు. శంకర్ రాకతో రామ్ సినిమా సెట్ అంతా షాక్ అయ్యింది. 


యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారని టాక్.