ఆ డైరక్టర్ తో గోపీచంద్ హ్యాట్రిక్ మూవీ..!

మ్యాన్లీ హీరో గోపీచంద్ మళ్లీ వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే గోపీచంద్ నటించిన సీటీమార్ రిలీజ్ కు రెడీ అవగా మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ టైటిల్ తో ఒక సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలే కాకుండా ఇప్పుడు మరో సినిమా కన్ఫర్మ్ చేశాడు గోపీచంద్. లక్ష్యం, లౌక్యం సినిమాలతో తనకు హిట్లు ఇచ్చిన డైరక్టర్ శ్రీవాస్ తో హ్యాట్రిక్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడు గోపీచంద్. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

వరుస సినిమాలైతే చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడంలో వెనకపడ్డ గోపీచంద్ చేస్తున్న ఈ మూడు సినిమాలతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. సీటీమార్ సంపత్ నంది డైరక్షన్ లో వస్తుంది. కబడ్డీ ఆట నేపథ్యంతో వస్తున్న ఆ సినిమా నుండి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. సినిమాలోని సాంగ్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇక మారుతి పక్క కమర్షియల్ సినిమా అయితే పక్కా హిట్ అని చెప్పొచ్చు. జాలీ ఎల్.ఎల్.బి 2 రీమేక్ గా వస్తున్న ఈ సినిమా గోపీచంద్ కు కచ్చితంగా హిట్ ఇస్తుందని చెప్పొచ్చు.