
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాతో సక్సెస్ అందుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి తన నెక్స్ట్ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ డైరక్షన్ లో చేస్తారని తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా స్వీటీ అనుష్క నటిస్తుందని వార్తలు వచ్చాయి. సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనుకున్న ఈ సినిమా నుండి అనుష్క డ్రాప్ అయ్యిందని లేటెస్ట్ టాక్. సినిమాలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నా సరే ఎందుకో అనుష్క ఈ ప్రాజెక్ట్ చేయడానికి సుముఖంగా లేదని తెలుస్తుంది.
నిశ్శబ్ధం సినిమా తర్వాత ఏ సినిమా కమిట్ అవని అనుష్క తన ఫ్యాన్స్ ను మరింత వెయిటింగ్ లో పెడుతుంది. నవీన్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుందని అనుకోగా ఆ ప్రాజెక్ట్ నుండి అమ్మడు తప్పుకుందని అంటున్నారు. అసలు అనుష్క సినిమాలను కొనసాగించాలని అనుకుంటుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.