
యువ హీరో నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. కార్తికేయ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో ఆ సినిమాకు సీక్వల్ గా కార్తికేయ 2 ప్లాన్ చేశారు. అయితే ఈ సీక్వల్ సినిమాకు టైటిల్ ను మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. కార్తికేయ 2 కి టైటిల్ గా దైవం మానుష్య రూపేణ టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. 2014లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాతో పాటుగా అఖిల్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా కూడా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. కార్తికేయ 2 అదే దైవం మానుష్య రూపేణ సినిమాలో కూడా నిఖిల్ కు జోడీగా అనుపమని సెలెక్ట్ చేశారు.