ట్రిపుల్ ఆర్ ఒక్క పాటకి 3 కోట్లు..!

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ RRR. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ కూడా సినిమాలో భాగమవుతుంది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం ఆఖరి సాంగ్ షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం ఏకంగా 3 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు టాక్.

ఒక్క పాటకి 3 కోట్లా అని షాక్ అవ్వొచ్చు. అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి తను అనుకున్న అవుట్ పుట్ రావడం కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేస్తాడు. సినిమాలో చాలా స్పెషల్ అయిన ఈ సాంగ్ కోసం 3 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ సాంగ్ లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటుందని తెలుస్తుంది. అక్టోబర్ 13న రిలీజ్ ప్రకటించిన RRR అనుకున్న డేట్ కు వస్తుందా రాదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది. రోర్ ఆఫ్ RRR అంటూ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో ఒకటి గురువారం రిలీజ్ చేస్తున్నారు. అందులో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.