రాక్షసుడు 2 ఎనౌన్స్ మెంట్..!

తమిళంలో సూపర్ హిట్టైన రాక్షసన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రమేష్ వర్మ. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ను ప్లాన్ చేశారు డైరక్టర్ రమేష్ వర్మ. రాక్షసుడు 2 టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ థ్రిల్లర్ జానర్ లో భయంకరంగా ఉంది.

అయితే సినిమా హీరో ఎవరన్నది ఇంకా తేలని ఈ ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ మాత్రం వచ్చింది. రాక్షసుడు 2 సినిమాలో స్టార్ హీరో నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కచ్చితంగా బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ సీక్వల్ లో నటించే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజతో ఖిలాడి సినిమా చేస్తున్న రమేష్ వర్మ రాక్షసుడు 2ని త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి డీటైల్స్ త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది.