
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీస్తున్న మహానటి సినిమాకు గాను ఎస్.వి.రంగారావు, సూర్యాకాంతం పాత్రలకు సూట్ అయ్యేలా ఉంటే సినిమాలో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ గా జూనియర్ ఎన్.టి.ఆర్, అక్కినేని నాగ చైతన్యను ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎస్.వి.ఆర్ సూర్యకాంతం పాత్రలకు సెర్చింగ్ మొదలైంది.
ఆ పాత్రలకు ఎవరైనా సరే తమ ఫోటోతో పాటుగా ఓ వీడియో క్లిప్ జతచేసి సినిమా ఆఫీస్ కు పంపించాలట. ఆడిషన్ టైంలో చిత్రయూనిట్ ఎవరైతే ఇంట్రెస్ట్ పంపిస్తారో వారిని షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేస్తారు. ప్రియాంకా దత్, స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహానటి సావిత్రిగా నిత్యా మీనన్ లీడ్ రోల్ చేస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం మీ లేదా మీ చుట్టుపక్కల ఎస్.వి.ఆర్, సూర్యాకాంతంలా మేనరిజాలను పలికించే టాలెంటెడ్ పీపుల్ ఉంటే వెంటనే వారికి ఈ సమాచారం అందచేసి అవకాశం వచ్చేలా చేసుకోండి. కేవలం సినిమా విషయాలనే కాకుండా ఇప్పటి వరకు బయటకు రాని విషయాలను కూడా ఇందులో ప్రస్థావించడం జరుగుతుందట. స్క్రిప్ట్ పరంగా పూర్తి సంతృప్తితో ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ త్వరలోనే దీని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.