తమన్నా డ్యాన్సులపై నాని కామెంట్స్..!

నాచురల్ స్టార్ నాని ఈ మధ్య తన సినిమాలతోనే కాదు వేరే హీరోల సినిమాలకు కూడా రెగ్యులర్ గెస్ట్ గా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడు. పిలిస్తే పలుకుతా అన్నట్టు వచ్చి నాని ఆ సినిమా విజయం ఆకాంక్షించి వెళతాడు. ఇక రీసెంట్ గా అభినేత్రి ఆడియోకి అటెండ్ అయిన నాని తమన్నా డ్యాన్సుల గురించి కామెంట్స్ చేశాడు. తమన్నా డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని కాని తను అలా డ్యాన్స్ చేయలేని కారణంగా తన పాటలను చూడటం వదిలేశానని అన్నారు.

ఇక ప్రభుదేవ అంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పిన నాని చిన్నప్పుడు చికుబుకు రైలే పాటకు ఇంట్లో స్టెప్పులేసే వాడినని అన్నారు. దర్శకుడు విజయ్ వ్యక్తిత్వం మంచిదని కోలీవుడ్ స్నేహితులు చెబుతుంటారని అన్నారు. ఇక ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న కోనా వెంకట్ కూడా సినిమాలో హీరో ప్రభుదేవ ఎంతో కష్టపడి చేశారని. ఆయనే ఈ టైటిల్ సజెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. 

రచయితలందరికి ఓ దర్శకుడిగా మారి రైటర్ యొక్క గొప్పతనం తెలియచేస్తున్న దర్శక రచయిత కొరటాల శివ చేతుల మీదుగా అభినేత్రి ఆడియో రిలీజ్ జరిగింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అరుధంతి కన్నా అదిరే రేంజ్లో హిట్ కొడుతుందని చిత్రయూనిట్ అంతా నమ్మకంతో చెబుతున్నారు.