పవర్ స్టార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఇక హీరోయిన్స్ కు అంతకుమించిన ఆనందం మరోటి ఉండదు. ప్రస్తుతం ఆ సంతోషంలోనే ఉంది ఓ రెండు సినిమాల అనుభవం ఉన్న హీరోయిన్స్ మానస హిమవర్ష. రొమాన్స్ సినిమాలో ప్రిన్స్ తో రొమాన్స్ చేసిన ఈ అమ్మడు మధ్యలో ఓ సినిమా చేసింది. దాదాపు కెరియర్ ముగిసింది అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే అమ్మడు నటించేది సినిమాలో హీరోయిన్ గా మాత్రం కాదులేండి. 

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కు మరదలి పాత్రలో మానస నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మానస ఆల్రెడీ జాయిన్ అయ్యింది కూడా. స్టార్ సినిమాలో చిన్న పాత్ర అయినా ఓ సెపరేట్ ఐడెంటిటీ వచ్చినట్టే మరి అలాంటిది పవర్ స్టార్ మరదలిగా ఛాన్స్ కొట్టేసిన మానస ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.

డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సగీతమ అందిస్తుండగా సినిమా ఓ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో పవర్ స్టార్ కు తమ్ముళ్లుగా యువ హీరోలను సెట్ చేశారట దర్శక నిర్మాతలు.