నిఖిల్ 18 పేజెస్ ఓటిటి బాట పడుతుందా..?

యువ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాను కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నారు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమా రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ లో ఉన్నారు మేకర్స్. ఆల్రెడీ సినిమాకు ఓటిటి ల నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.        

నిర్మాతలు కూడా సినిమాను ఓటిటి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిఖిల్ 18 పేజెస్ ఓటిటి రిలీజ్ అవుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా నిఖిల్ కార్తికేయ సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కార్తికేయ సినిమాకు సీక్వల్ గా వస్తుంది.