
రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో తన కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆ సినిమా దర్శకుడు కొరటాల శివకు ఓ భారీ బహుమతిని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే శ్రీమంతుడు హిట్ తో మహేష్ బాబు కొరటాలకు ఓ ఆడి కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. కాని ఇప్పుడు శివకు ఎలాగు కారు ఉంది కాబట్టి తారక్ ఇప్పుడు కొరటాల శివకు ఓ డూప్లెక్స్ హౌజ్ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాడట.
కొంతకాలంగా స్టార్ హీరోలేమో వరుసెంట హిట్లు కొడుతుంటే జూనియర్ తన సినిమాల రిజల్ట్ తో వెనుకపడ్డాడు. ఇక లాస్ట్ ఇయర్ టెంపర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన ఎన్.టి.ఆర్ ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాతో కూడా తన ఖాతాలో ఓ సూపర్ హిట్ వేసుకున్నాడు. రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచేలా చేసుకున్న జూనియర్ ఇంతటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ కొరటాల శివకు ఓ ఇళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాడట. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ హిట్లతో టాలీవుడ్ టాప్ డైరక్టర్ గా క్రేజ్ సంపాదించిన కొరటాల శివ రానున్న సినిమాలతో కూడా ఇదే రేంజ్ హిట్లు రాబట్టుకోవాలని ఆశిద్దాం.