
మాటల మాంత్రికుడు త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ అంటే ఇక ఆ ప్రాజెక్ట్ మీద ఉండే అంచనాలు మనకు తెలిసిందే. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్లో ఉన్న మహేష్ ఆ తర్వాత కొరటాల శివతో ఫిక్స్ అయ్యాడు. ఇక అఆ తర్వాత పవన్ కోసం సినిమాకు సిద్ధమవుతున్న త్రివిక్రం ఆ తర్వాత మహేష్ తో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా సరికొత్త జోనర్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే మహేష్ తో కథా చర్చల్లో పాల్గొన్న త్రివిక్రం ఈసారి కొత్తగా ఫుల్ లెంథ్ కమర్షియల్ వేలో సినిమాను ఉండేలా చూపిస్తున్నారట. అతడు, ఖలేజా తర్వాత రాబోతున్న ఈ కాంబినేషన్ మీద అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. బ్రహ్మోత్సవంతో ఫ్లాప్ ఎదుర్కున్న మహేష్ మురుగదాస్ సినిమాతో మెమరబుల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక త్రివిక్రంతో కూడా కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచే సినిమాతో రావాలని ప్రయత్నిస్తున్నాడు.
పవన్ చేస్తున్న కాటమరాయుడా సినిమా అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన త్రివిక్రం ఈలోపే నాగశౌర్య తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడట. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగశౌర్య త్రివిక్రంతో ఛాన్స్ అంటే లక్కీ ఛాన్స్ అన్నట్టే.