
ప్రస్తుతం ఫాంలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఓ సినిమా విషయంలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. రీసెంట్ గా జనతా సక్సెస్ తో జూనియర్ సరైనోడు సూపర్ హిట్ తో బన్ని ఎవరికి వారు తమ స్టామినా ప్రూవ్ చేసుకుంటుంటే ఓ తమిళ దర్శకుడి అవకాశం కోసం జూనియర్ తో బన్ని రంగంలో దిగుతున్నాడు. కోలీవుడ్ మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ సంపాదించిన లింగుస్వామి అసలైతే తారక్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేశాడు.
కథ అంతా ఓకే అవగా చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది. ఇక అదే కథతో అల్లు అర్జున్ దగ్గర సినిమా ఓకే చేయించుకున్న లింగుస్వామి ఒకానొక టైంలో బన్ని కూడా హ్యాండ్ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయాడు. అయితే లింగుస్వామి మళ్లీ ఎన్.టి.ఆర్ డేట్స్ కోసం ప్రయత్నిస్తుండగా బన్ని అతనికి ఫోన్ చేసి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తమిళంలో క్రేజీ డైరక్టర్ అయిన లింగుస్వామి తెలుగులో విశాల్ పందెం కోడి సినిమాతో ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
మరి జూనియర్ కాదన్న కథను బన్ని ఓకే చేయడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే దువ్వాడ జగన్నాథంతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బన్ని లింగుస్వామి మూవీతో కూడా మరో క్రేజీ సినిమాకు నాంధి పలికాడు. ఇక ఈ సినిమాతో తమిళంలో మొదటి డైరెక్ట్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు.