రామ్ వచ్చేస్తున్నాడు ఇది ఫిక్స్..!

ఈ మధ్య సినిమాల పరిస్థితి ఎలా ఉంది అంటే సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా ఆరోజు ఉదయం దాకా ఆ సినిమా వస్తుంద రాదా అన్న డౌట్ కలుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఈమధ్యలోనే చాలా సినిమాలు రిలీజ్ డేట్ రోజునే పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు చూశాం. అయితే ఈ క్రమంలో ఎనౌన్స్ చేసిన డేట్ కు సినిమా వదిలే దర్శక నిర్మాతలు చాలా తక్కువమంది అని చెప్పాలి. ఇక ఎనౌన్స్ చేసిన డేట్ ను మార్చి మళ్లీ ఏమైందో ఏమో కాని అదే డేట్ కు రిలీజ్ చేస్తున్నారు రామ్ హైపర్.  

ఈ ఇయర్ మొదటిరోజే నేను శైలజతో సూపర్ హిట్ అందుకున్న రామ్ ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేసేందుకు సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్లో హైపర్ గా వస్తున్నాడు. సినిమా ఓపెనింగ్ రోజే సినిమాను సెప్టెంబర్ 30 రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే ఈ మధ్యలో కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువై సినిమాను దసరా బరిలో దించాలని చూశారు. కాని దరసరా పోటీలో చాలా సినిమాలు వస్తుండటంతో మళ్లీ ముందు అనుకున్న రిలీజ్ డేట్ కే ఫిక్స్ అయ్యారు.  

రామ్ తో రాశి ఖన్నా జతకట్టిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. సక్సెస్ ఫుల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా రామ్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని అంటున్నారు. సంతోష్ శ్రీనివాస్ తో ఆల్రెడీ కందిరీగ హిట్ అందుకున్న రామ్ హైపర్ కూడా అదే తరహా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.