
మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు మహేష్ నిజంగా సూపర్ స్టారే అంటున్నాడు. సినిమా షూటింగ్ టైంలో సెట్స్ కెళ్లిన ఠాగూర్ మధు షూటింగ్ లో మహేష్ డెడికేషన్ చూసి అవాక్కయ్యాడట. ఇక సెట్స్ మహేష్ ఎనర్జీ, షాట్ రెడీ అని దర్శకుడు చెప్పగానే చూపించే నటన అంతా మైండ్ బ్లోయింగ్ అంటున్నాడు.
మరి ఈ నిర్మాతకు తెలిదా మన పోకిరి రికార్డుల చరిత్ర.. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోయే మహేష్ డైరక్టర్ చెప్పిన సీన్ కాదు అంతకుమించి అభినయం కనబరుస్తాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి కల్లా పూర్తి చేసి ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక డైరక్టర్ మురుగదాస్ కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు అందుకే మహేష్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 
అసలైతే ఎప్పుడో సినిమా చేయాల్సిన ఈ కాంబినేషన్ ఇన్నాళ్లకు ముడిపడింది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. సినిమా మీద అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే సరుకు సినిమాలో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.