పవర్ స్టార్ తో లక్కీ ఛాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అదృష్టం వస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కసారిగా అ లక్కీ ఆఫర్ వస్తే ఎగిరిగంతులేస్తారు ఎవరైనా ఇప్పుడు కీచక హీరోయిన్ యామిని భాస్కర్ కూడా అదే ఆనందంలో ఉంది. కిశోర్ పారధసాని డైరక్షన్లో పవర్ స్టార్ చేస్తున్న కాటమరాయుడా షూటింగ్ ఈ నెల 24 నుండి స్టార్ట్ అవుతుంది. కొంతభాగం పవన్ కళ్యాణ్ లేకుండానే కానిచ్చేసిన డాలి ఇక పవర్ స్టార్ సీన్స్ పెండింగ్ పెట్టేశాడట.

ఇక సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో యామిని భాస్కర్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కీచకలో మెయిన్ లీడ్ చేసినా అంతకుముందు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన రభస సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది అమ్మడు. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. పవన్ సినిమా అంటే ఏ హీరోయిన్ కి అయినా క్రేజీ ప్రాజెక్ట్ అన్నట్టే. అయితే హీరోయిన్ గా కాకపోయినా సినిమాలో ప్రాముఖ్యత ఉండే పాత్ర అంటున్నారు కాబట్టి కచ్చితంగా యామిని ఈ సినిమాతో సూపర్ ఇమేజ్ సంపాదించే అవకాశం ఉంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాత పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. అయితే అంచనాలను అందుకోలేని ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అదే టీంతో పవన్ కాటమరాయుడా సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.