దర్శకుడికి చరణ్ డెడ్ లైన్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ధ్రువ సినిమా ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అసలైతే అక్టోబర్ స్పెషల్ గా దసరా సీజన్లో రిలీజ్ కావాల్సిన ధ్రువ ఇంకా లేట్ అవుతుంది. అందుకే సినిమాను డిసెంబర్ 2కి పోస్ట్ పోన్ చేశారట. అయితే టైం దొరికింది కదా అని ఇంకా లేట్ చేయకుండా సినిమాను త్వరగా పూర్తి చేయాలని దర్శకుడికి చెప్పాడట చరణ్. అంతేకాదు సినిమా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాని డెడ్ లైన్ పెట్టాడట. 

నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా తన చేతిలో ఫస్ట్ కాపీ ఉండాలని ఆవిధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని చిన్నపాటి వార్నింగే ఇచ్చాడట. ఏమాటకామాట చెప్పాలంటే చరణ్ తన తండ్రి మూవీ ప్రొడక్షన్ భాధ్యతలతో తన సినిమాను లేట్ చేశాడు. అయితే ఇప్పుడు త్వరగా తన సినిమాను కూడా ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

మైండ్ గేంతో కూడా కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా మణిరత్నం హీరో అరవింద్ స్వామి నటిస్తున్నారు. మాత్రుక తని ఒరువన్ లో కూడా విలన్ గా నటించిన స్వామి తెలుగులో నటించేందుకు ముందు నిరాకరించినా తర్వాత అతన్ని ఒప్పుకునే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఓకే చేయించారు.