
ప్రస్తుతం తెలుగు సినిమాలన్ని ఓవర్సీస్ మార్కెట్ మీద దృష్టి పెట్టుకుని సినిమాలు చేస్తున్నాయంటే నమ్మాలి. ఇక్కడ యావరేజ్ ఆడినా సరే అక్కడ కాసుల వర్షం కురిపిస్తే చాలు సినిమా హిట్ అన్నట్టే లెక్క. అందుకే ఈమధ్య నిర్మాతలు హీరో మార్కెట్ ను బట్టి ఓవర్సీస్ రైట్స్ ను కూడా చుక్కలంటేలా డిమాండ్ చేస్తున్నారు. ఇక నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ ఫాంలో ఉన్న దిల్ రాజు తాను చేస్తున్న వరుస నాలుగు సినిమాల ఓవర్సీస్ రైట్స్ ను 18 కోట్లకు అమ్మేశాడట.
ఓవర్సీస్ లో మంచి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ క్రేజ్ సంపాదించిన బ్లూ స్కై సినిమాస్ ఈ డీల్ కుదుర్చుకున్నారట. అయితే వీటిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం, నాని నేను లోకల్, వరుణ్ తేజ్ ఫిదా, శర్వానంద్ శతమానం భవతి ఉన్నట్టు తెలుస్తుంది. సెట్స్ మీదున్న సినిమాలకే ఈ రేంజ్లో డీల్ కుదుర్చుకున్న దిల్ రాజు నిజంగానే సూపర్ అనేస్తున్నారు.
మరి డీల్ అయితే టేంప్టిన్ గానే ఉంది. మరి పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం రేసులో మంచి ఫాంలో ఉన్న బన్ని, నానిల సినిమాలైతే ఢోఖా లేదని చెప్పాలి. మరి శర్వానంద్, వరుణ్ తేజ్ సినిమాల మీద బ్లూస్ స్కై సినిమాల అదృష్టం ఆధారపడి ఉంది. అవి కూడా హిట్ అయితే ఓవర్సీస్ లో కాసుల వర్షం కురిపించినట్టే.