
నాగ చైతన్య హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమం రీమేక్ గా అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ఆడియో మంగళవారం రాత్రి జరిగింది. అక్కినేని అభిమానుల కోలాహలంతో ప్రేమం ఆడియో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ఆడియోలో చైతు తన సినిమా దర్శకుడు చందు మొండేటికి సభాముఖంగా సారీ చెప్పాడు.
కార్తికేయ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న చందు మొండేటి ప్రేమం రీమెక్ చేయడం జరిగింది. అయితే కేవలం నాగార్జున చెప్పారని.. చైతు మీద ఉన్న ఇష్టంతోనే ఈ సినిమా చేసి ఉంటాడని అందరు అనుకున్నారు. ఇక అదే క్రమంలో చైతు కూడా చందు టాలెంట్ ఉన్న దర్శకుడని తనకి ప్రేమం రీమేక్ ఇచ్చి తప్పు చేశామని.. అయినా సరే తన క్రియేటివ్ థాట్స్ తో సినిమా బాగా తీశాడని అన్నారు. కచ్చితంగా తను రాసిన కథ ఉంటే చందుతో మరో సినిమా తీసేందుకు తాను సిద్ధమని అన్నారు నాగ చైతన్య.  
తీసిన ఒక్క సినిమాతోనే తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న చందు మొండేటి తప్పకుండా ప్రేమం సినిమాను కూడా అంతే గొప్పగా తీసి ఉంటాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్లో ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.