30 కోట్ల ఆఫర్ మిస్ చేసుకున్న మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్య సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో ఢీలా పడ్డ మహేష్ చేస్తున్న మురుగదాస్ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ భారీ ఆఫర్ ను కూడా రిజక్ట్ చేశాడట మహేష్. తమిళ నటుడు దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో మహేష్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో మహేష్ నటించేందుకు 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తామని అన్నారట.

రెమ్యునరేషన్ టెంప్ట్ చేసినా సరే మహేష్ మాత్రం సింపుల్ గా సారీ అనేశాడట. మహేష్ కాదనడానికి కారణం కథ నచ్చలేదా లేక ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలా అన్నది తెలియాల్సి ఉంది. కుదిరితే మహేష్ తో పాటు తమిళ హీరో జయం రవిని కూడా ఈ సినిమాలో పెట్టి మల్టీస్టారర్ గా ప్లాన్ చేశాడట సుందర్ సి. కాని మహేష్ కాదనడంతో వెనక్కి తగ్గారు. మహేష్ కాదన్నాడు కాబట్టి మరో తెలుగు హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఎవరు ఒప్పుకోకపోతే కేవలం తమిళంలోనే ఆ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. మొత్తానికి అలా ఓ భారీ ఆఫర్ ను మహేష్ రిజక్ట్ చేయడం జరిగింది. మరి డబ్బే ప్రధానం అనుకుంటే సినిమా తీసి వదలొచ్చు కాని మహేష్ అలా చేయకుండా సూపర్ అనిపించుకున్నాడు.