
సరిగ్గా ఆకలి మీదున్న యంగ్ టైగర్ అభిమానులకు జనతా గ్యారేజ్ సరిగ్గా వారి ఆకలి తీర్చే సినిమా అయ్యింది. ఈ విషయం రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో కళ్యాణ్ రాం కూడా అన్నారు. నూనుగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ ను షేక్ ఆడించిన జూనియర్ ఈ మధ్య కాస్త వెనుక పడ్డాడనిపించాడు. అయితే ఎప్పుడైతే ఫ్యాన్స్ కూడా తనలోని మార్పుని కోరుకుంటున్నాం అని అనేశారో తనని తానే మార్చుకుని సినిమాలు తీయడం మొదలు పెట్టాడు.
టెంపర్, నాన్నకు ప్రేమతో ఇదవరకు ఎన్.టి.ఆర్ ఛాయలు అసలు కనిపించకుండా చేసి మంచి ఫలితాలను అందుకున్నాడు. ఇక వచ్చిన జనతా గ్యారేజ్ అయితే జూనియర్ ను మరో కోణంలో చూసేశారు. అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సరే కలక్షన్స్ ప్రభంజనం జరిగింది. ఇప్పటికే స్టార్ సినిమాలన్నిటిని దాటుకుంటూ వచ్చిన ఈ మూవీ 120 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించింది.
అంటే దాదాపు 80 కోట్ల షేర్ అన్నమాట. బాహుబలి తర్వాత శ్రీమంతుడు గ్రాస్ 100 కోట్ల పైనే దాటినా ఇంత ఫాస్ట్ గా రాలేదు. ఇక టోటల్ రన్ లో శ్రీమంతుడు 86 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మరి జూనియర్ మరో 6 కోట్లు సాధించగలిగితే సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసినట్టే.