
అక్కినేని కుటుంబం నుండి వచ్చిన సుమంత ఇంతవరకు హీరోగా నిలదొక్కున్నది లేదు. కెరియర్ మొదట్లో నాగార్జున సహకారం అందించినా సక్సెస్ లు రాకపోవడంతో ఇక ఆయన కూడా లైట్ తీసుకున్నడు. సినిమాలైతే చేస్తున్నా సక్సెస్ సాధించలేకపోతున్న సుమంత్ ఇక తానే నిర్మాతగా మారి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కీ డోనార్ రీమేక్ గా ఓ సినిమా నిర్మిస్తున్నాడు. దీనికి టైటిల్ గా నరుడా డోనరుడా అని పెట్టడం జరిగింది.
కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా కథను చెప్పేస్తున్నట్టు ఉంది. తెలుగులో వీర్య దానం కాన్సెప్ట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది తెలియదు కాని ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. సుమంత్ అప్పటికే సినిమా చేస్తుండటంతో వెనక్కి తగ్గారు. ఇక ఈరోజు కింగ్ నాగార్జున చేతుల మీదుగా నరుడా డోనరుడా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
భైరవ ద్వీపం సాంగ్ చరణంలా అనిపిస్తున్న ఈ టైటిల్ సౌండింగ్ కొత్తగా ఉంది. అంతేకాదు పోస్టర్ లో కూడా సుమంత్ ఇదవరకు కన్నా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. తానో స్పెర్మ్ డోనర్ అని పోస్టర్ లోనే కథ చెప్పేస్తున్న సుమంత్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విజయంపై సుమంత్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి సుమంత్ కు ఈ సినిమా అయినా హిట్ కిక్ ఇస్తుందేమో చూడాలి.