ఈసారి డ్యాన్సుల్లో ఇరగదీస్తాడట..!

సూపర్ స్టార్ మహేష్ ఎంత అందగాడో మాటల్లో చెప్పలేం.. టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సం హీరోగా క్రేజ్ ను సంపాదించిన ప్రిన్స్ మహేష్ ఒక్క విషయంలో మాత్రం  అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాడు. గ్రేస్ ఫుల్ పర్ఫార్మెన్స్.. సీన్ ఏదైనా సరే ఎలాంటి డైలాగ్ అయినా సరే ఇరగదీసేస్తాడు మిగతా వన్ని ఓకే కాని డ్యాన్స్ విషయంలో మాత్రం మహేష్ అందరికి లోకువయ్యాడు. 

ఇక రీసెంట్ గా మహేష్ ఫ్లాపుల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ సాధించిన బ్రహ్మోత్సవంలో అయితే మహేష్ పూర్ డ్యాన్స్ మిగతా హీరో అభిమానులకు అవకాశం  ఇచ్చినట్టు ఉంది. ఆ డ్యాన్స్ స్టెప్పులపై మహేష్ మీద బీభత్సమైన కామెంట్స్ చేశారు యాంట్రీ ఫ్యాన్స్. అయితే అందుకే ఈసారి డ్యాన్సుల్లో కూడా తన పట్టు  సాధించాలని చూస్తున్నాడట మహేష్. ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమాలో మహేష్ బాబు ఇంతవరకు చేయని స్టెప్స్ తో అలరిస్తాడని అంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత  మరోసారి శ్రీమంతుడు కాంబినేషన్లో కొరటాల శివతో కలిసి సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మహేష్. ఓ పక్క వంశీ పైడిపల్లి మూవీ కూడా డిస్కషన్స్  స్టేజ్ లో ఉంది. సో మొత్తానికి మహేష్ లోని ఈ స్పీడ్ ఫ్యాన్స్ కు ఉత్సాహం కలిగిస్తుందని చెప్పాలి.