ఆగిపోయిన ఆదిపురుష్ షూటింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ కు బ్రేక్ పడ్డది. చిత్రయూనిట్ మొత్తం ముంబై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క ప్రభాస్ రాధే శ్యాం సినిమాలో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని సజెస్ట్ చేశాడట. ఈ గ్యాప్ లో వాటిని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ చేస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు. సలార్ కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.