
మంచు వారబ్బాయి మనోజ్ అందరితోనూ సరదాగా ఉంటాడు.. తన సహ నటులతోనే కాదు నటీమణులతో కూడా సరదాగా ఉండే మనోజ్ రీసెంట్ గా జరిగిన ఎంబి@40 కార్యక్రమంలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ను తన గాళ్ ఫ్రెండ్ అనేశాడు. అయితే సభా మర్యాద అని కూడా చూడకుండా మనోజ్ అది కూడా తన భార్య ముందే ఓ హీరోయిన్ ను గాళ్ ఫ్రెండ్ అనడం ఏంటి అని అందరు అనుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు.
తాతినేని సత్య డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో మనోజ్ గాళ్ ఫ్రెండ్ గా ప్రగ్యా నటిస్తుందట. మొదటి సినిమా మిర్చి లాంటి కుర్రాడు ఎవరికి గుర్తుండదు కాని అమ్మడు కంచె సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇక అప్పటినుండి ప్రతి సినిమా ఈవెంట్ కు ప్రగ్యా జైశ్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. మొత్తానికి మనోజ్ ఆ సినిమా దృష్టితో ప్రగ్యా నా గాళ్ ఫ్రెండ్ అనేశాడు. అయితే ప్రగ్యా కూడా మనోజ్ అన్న మాటలను సరదాగానే తీసుకుంది.
పరిశ్రమలోని మహామహుల సమక్షంలో టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన సందర్భంగా ఎంబి@40 అంటూ మోహన్ బాబ్ 40 సంవత్సరాల సిని జీవితాన్ని పురస్కరించుకుని ఈ సన్మానం చేయడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమంలో మోహన్ బాబుకి నవరస నట తిలకం అనే బిరుదుతో ఆయనకు గౌరవాన్ని అందించారు.