నాని ప్లేస్ లో అవసరాల..!

రీసెంట్ గా జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ అందుకున్న అవసరాల ఆ సినిమా హిట్ అయినందుకు తెగ సంతోషంలో ఉన్నాడు. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే కంటే ఇది ఎక్కువ విజయం సాధించడం విశేషం. అయితే ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా అలా తళుక్కున మరిశాడు. అసలైతే ఆ పాత్రలో అవసరాల శ్రీనివాస్ రావాలనుకున్నాడట. కాని ఇద్దరు హీరోలను వదిలి తనను ఓకే చేస్తే కచ్చితంగా వారిద్దరి కన్నా తనలో ఏం ఎక్కువ ఉంది. కేవలం దర్శకుడు కాబట్టే అవసరాల ఇలా మాయ చేశాడా అంటారని ఆ పాత్రకు నానిని ఒప్పించి చేపించాడట.

ఇక అది కాకుండా అవసరాల కోసం కూడా ఓ చిన్న సీన్ రాసుకున్నాడు షూట్ కూడా చేశారట. కాని అది ఎడిటింగ్ లో తీసేశారట. ఊహలు గుసగుసలాడే సినిమాలో తాను కూడా సినిమా మొత్తం ట్రావెల్ అయిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా కనిపిస్తే బాగుండేది. అయితే నాని నటించిన ఆ సీన్ కూడా షూట్ చేసింది తను కాదు తన గురువు మోహన్ గారు అని చెప్పుకొచ్చాడు అవసరాల శ్రీనివాస్. 

సో నాని చేశాడనే కాదు ఒకవేళ అవసరాల శ్రీనివాస్ అయినా నాని ప్లేస్ లో చేసుంటే కచ్చితంగా ప్రేక్షకులు ఇలాంటి రిజల్ట్ ఇచ్చి ఉండేవారు. ఏనీహౌ ఓ మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించిన అవసరాల శ్రీనివాస్ కేవలం రెండు సినిమాలతోనే ప్రతిభ గల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. మరి రాబోయే సినిమా నానితో ఉంటుందట. ఆ సినిమాను ఇంకెలాంటి కథతో మనముందుకు తెస్తాడో చూడాలి.