రకుల్ చేతిలోకి బిగ్ సి..!

హీరోయిన్స్ గా క్రేజ్ సంపాదిస్తే వారికి సినిమా ఆఫర్లే కాదు వాణిజ్య ప్రకటనల్లో కూడా ఓ రేంజ్ పాపులారిటీ వస్తుంది. ఏదైనా సరే మొదటి ఆప్షన్ వారే అన్నట్టు ఉంటుంది. ఇక అదే క్రమంలో కెరియర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మొబైల్స్ రిటైల్ స్టోర్ బిగ్ సికి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. సినిమాల్లోకి రాకముందు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రకుల్ హీరోయిన్ గా మారాక తన రేంజ్ మారిపోయింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస హిట్లతో క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు స్టార్ సినిమా అంటే ముందు రకుల్ ను అడిగి చూశాకే ఆమె డేట్స్ లేకపోతే వేరే హీరోయిన్స్ కు వెళ్లే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న రకుల్ చేతిలో ఇప్పుడు బిగ్ సి కూడా చేరింది. ఇక ఇంతకుముందు బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్లుగా గోవా బ్యూటీ ఇలియానా, చార్మింగ్ గాళ్ చార్మి ఉన్నారు.

అయితే క్రేజ్ ను బట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రాముఖ్యత దక్కించుకునే హీరోయిన్స్ ఇప్పట్లో బిగ్ సికి రకుల్ ఆ అవకాశం కొట్టేసింది. ఇక నిన్న జరిగిన ఈ ఈవెంట్ లో రకుల్ చిట్టి పొట్టి డ్రస్సులతో కేక పెట్టించేసింది. సినిమాల్లోనే కాదు బయట కూడా అమ్మడి అందాలకు దాసోహం అనేస్తున్నారు ప్రేక్షకులు. మరి ముందు ముందు ఇంకెన్ని కంపెనీల్ ఆమెనుకావాలంటాయో చూడాలి.