సమంత ప్రేమపై చెన్నైలో ఓపెన్ అయిన చైతన్య..!

నాగ చైతన్య సమంత లవ్ గురించి ఇప్పుడు అందరికి ఓపెన్ టాక్.. ఏముందు కొద్దిరోజుల్లో ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కడమే కదా అని అంటున్నారు. కింగ్ నాగార్జున కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఎటుకూడి అటు చైతు కాని ఇటు సమంత కాని ఈ విషయం మీద నోరు విప్పింది లేదు. అయితే ఇక్కడ మీడియా తప్పించుకు తిరుగుతున్న నాగ చైతన్య కోలీవుడ్ మీడియాకు మాత్రం సమాధానం చెప్పక తప్పలేదు.

 సమంతతో పెళ్లి విషయం గురించి స్పందించిన చైతు వచ్చే ఏడాది తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కొద్దిరోజులుగా సీక్రెట్ గా నడుస్తున్న వీరి లవ్ సీక్రెట్ ఈ మధ్య అందరికి తెలియడంతో అందరికి కనిపించేలానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక విషయం ఇది అని తెలిశాక మరింత రెచ్చిపోయిన మీడియా ఇద్దరిని టార్గెట్ చేసింది. మీడియాలో ఎన్ని వార్తలొచ్చినా నోరు మాత్రం విప్పని చైతు తమిళ మీడియా ముందు ఓపెన్ అయిపోయాడు.

 సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లో టాలీవుడ్ థండర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న చైతు చెన్నై మీడియా ముచ్చటించారు. ఇక పనిలో పనిగా సమంతతో తన మ్యారేజ్ ఎప్పుడో కూడా క్లారిటీ ఇచ్చాడు నాగచైతన్య. సో సమంత చెప్పకపోయినా చైతు మాత్రం తను సమంతను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పేశాడు. మరి సమంత ఏమో ఇంకా అది ఇది అంటూ ఏవేవో కారణాలు చెబుతూ కాలం వెళ్లదీస్తుంది. ఎలాగు చైతు ఓపెన్ అయ్యాడు కాబట్టి సమంత కూడా చెప్పేస్తే ఇక తిరుగు ఉండదు.