
సీనియర్
నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయముతూ చేస్తున్న సినిమా నందిని నర్సింగ్
హోం.. పివి గిరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అయితే నరేష్ కోరిక మేరకు ఈ సినిమా ఆడియోకి చీఫ్ గెస్ట్ గా మహేష్ రాబోతున్నాడట. ఇప్పటికే
రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా చేసింది. నందిని నర్సింగ్
హోం ట్యాగ్ లైన్ ఇక్కడ అంతా క్షేమం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మహేష్ చేత ఆడియో రిలీజ్ చేయిస్తే సినిమా ఇంకాస్త ప్రేక్షకుల్లోకి వెళ్తుందని మహేష్ ను ఒప్పించారట. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో పాటుగా మిగతా హీరోలందరు తమ బెస్ట్ విశెష్ అందించడం జరిగింది. మరి ఈ నందిని నర్సింగ్ హో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.