చిరు, బన్ని మల్టీస్టారర్ మూవీ..!

మెగాస్టార్ స్టార్ రీ ఎంట్రీలో మెగా కాంపౌండ్ లో జోష్ పెరిగింది.. ఇక అందరికంటే ఎక్కువగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ రీ ఎంట్రీకి తెగ ఆనందంలో ఉన్నాడు. అయితే తాను ఈ స్థాయిలో ఉండేందుకు మెగాస్టారే కారణం అంటూ ప్రతిసారి చెప్పే బన్ని ఈసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. అవును మెగాస్టార్ తో స్టైలిష్ స్టార్ మల్టీస్టారర్ మూవీ ప్లానింగ్ లో ఉందట. కన్నడ దొడ్డమానే హడ్గ మూవీ త్వరలో రిలీజ్ అవబోతుంది. శాండల్ వుడ్ సూపర్ స్టార్స్ అంబరేష్ , పుణీత్ రాజ్ కుమార్ ఇద్దరు ఆ సినిమాలో నటించడం జరిగింది.

పవర్ స్టార్ పుణీత్ లీడ్ రోల్ చేస్తుండగా అంబరీష్ ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టు టాక్. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే పుణీత్, అంబరీష్ బదులు అల్లు అర్జున్, చిరంజీవిలను ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే మెగా అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం. అయితే రిలీజ్ అయ్యాక రిజల్ట్ ను బట్టి సినిమాపై నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నారట.

ఇప్పటికే చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్న బన్ని పవర్ ఫుల్ కథ దొరికితే అందుకు సిద్ధమే అని ఎప్పుడే చెప్పాడు. ఖైది నెంబర్ 150 సినిమాతో తన సత్తా చాటేందుకు సిద్ధమైన చిరంజీవి మిగతా మెగా హీరోలతో కూడా కలిసి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి చిరు, బన్ని మల్టీస్టార్ కుదిరితే ఇక ఇండస్ట్రీ రికార్డులు బద్ధలవడం ఖాయమన్నట్టే.