
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న తారక్ కు ఇప్పుడు తన తర్వాత తీసే సినిమా మీద క్లారిటీ రాలేదు. వక్కంతం వంశీ, పూరి జగన్నాథ్ ఇద్దరిలో ఎవరో ఒకరు జూనియర్ ను డైరెక్ట్ చేస్తారని నిన్న మొన్నటి టాక్ కాని ఇప్పుడు సడెన్ గా బోయపాటి శ్రీను కూడా రంగంలోకి దిగాడట. ఆల్రెడీ దమ్ము సినిమా ఇద్దరు కలిసి పనిచేశారు. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
అందుకే మరోసారి టైగర్ ను అదే రేంజ్లో చూపించే కథతో కలిశాడట బోయపాటి శ్రీను. తారక్ కూడా బోయపాటి సినిమాతో చిన్న మేకోవర్ చేసే ఆలోచనలో ఉన్నాడట. దమ్ము ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ లోని కసిని ఆ సినిమా బయట పెట్టింది. కమర్షియల్ గా ఫ్లాపే అయినా దమ్ము అభిమానులకు నచ్చేసింది. బోయపాటి ఎన్టీఆర్ మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ కనుక సినిమా చేస్తే ఇండస్ట్రీ రికార్డులు షురూ చేయడం ఖాయం.
ఇద్దరు దర్శకులు కాస్త ముగ్గురయ్యారు మరి ఈ టైంలో తారక్ ఎవరికి తన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ఇంపార్టెంట్. అయితే వక్కంతం వంశీ ఆల్రెడీ రేసులోంచి వెనక్కి తగ్గాడు కాబట్టి పూరి, బోయపాటి ఇద్దరిలో ఎవరినో ఒకరిని తారక్ తన తర్వాత సినిమా దర్శకుడిగా ఎనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనతా గ్యారేజ్ సక్సెస్ తో కాస్త రిలాక్స్ అవుతున్న తారక్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఇక తర్వాత సినిమా గురించి ఫైనల్ డెశిషన్ తీసుకోనున్నాడు.