అవసరాల శ్రీనివాస్ పై మెగా కన్ను..!

నటుడిగా దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మంచి జోష్ లో ఉన్నాడని చెప్పాలి.. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమాతో తన ప్రతిభ చాటుకున్న అవసరాల శ్రీనివాస్ రీసెంట్ గా రిలీజ్ అయిన జ్యో చ్యుతానందతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఎమోషనల్ బ్లాక్ లో అవసరాల అందరి మనసులను దోచేశాడు. అందుకే ఇప్పుడు అతనికి లక్కీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తన రెండు సినిమాల నిర్మాత సాయి కొర్రపాటి మూడో సినిమా నాని హీరోగా ఎనౌన్స్ చేయగా ఇప్పుడు ఈ దర్శకుడి మీద మెగా కాంపౌండ్ కన్ను పడిందట.

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అవసరాల టాలెంట్ గురించి ప్రస్థావించడం జరిగిందట. అంతేకాదు కుదిరితే ఊహలు గుసగుసలాడే కథలాంటి స్టోరీ ఏమన్నా ఉంటే నిహారికతో తీసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక అల్లు శిరీష్ ను కూడా అవసరాలతో పనిచేయించే అవకాశం ఇవ్వబోతున్నారట అల్లు అరవింద్. కేవలం రెండు సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అవసరాల శ్రీనివాస్ ఇదే రేంజ్ హిట్లు కొడితే స్టార్ డైరక్టర్ కు పోటీ ఇస్తాడనడంలో సందేహం లేదు.

ఒక్కసారి మెగా హీరోల మెప్పు పొందితే ఇక ఆ దర్శకుడికి వరుస మెగా హీరోలంతా అవకాశాలిచ్చేస్తారు. ఇప్పటికే అల్లు శిరీష్ లైన్లో ఉండగా ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు కూడా ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా నటుడిగా కోట్లు సంపాదించడం లేటు కావొచ్చేమో కాని దర్శకుడిగా మారిన మూడో సినిమాకే క్రేజీ ఆఫర్లతో అవసరాల శ్రీనివాస్ ఊహించని రేంజ్లో డిమాండ్ పెరిగేసింది. సో ఈ డిమాండ్ ఇలాగే ఉండేలా తీసే ప్రతి సినిమా సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.