
హీరోయిన్ గా ఉంటూనే సమాజం పట్ల గౌరవం కలిగి తన మంచి మనసుతో ఎన్నో మంచి పనులను చేస్తున్న సమంత అప్పుడప్పుడు కాస్త నోటి దురుసుతనంతో అందరికి షాక్ ఇస్తుంది. ఇన్నాళ్ల కెరియర్ లో సౌత్ సినిమాలతో టాప్ రేంజ్ హీరోయిన్ గా చెలామణి అయిన ఈ భామ ఇప్పుడు సౌత్ సినిమాల్లో ఓ హీరోయిన్ కు అర్ధవంతమైన పాత్రలు రావట్లేదు.. అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదంటూ ట్వీట్ చేసింది. నాగ చైతన్య సమంతల పెళ్లి త్వరలో ఉండబోతుందని.. అందుకే సినిమాలు ఆపేసిందని బయట టాక్.
కాని సమంత మాత్రం అవేవి చెప్పకుండా తనకు మంచి రోల్స్ రాకనే సినిమాలను చేయట్లేదు అన్నట్టు కలరింగ్ ఇస్తుంది. మరి ఇప్పటిదాకా చేసిన పాత్రలన్ని మరి అలాంటి కోవకు చెందినవేగా మరి ఇప్పుడు అమ్మడికి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో అని కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ రిలీజ్ జనతా గ్యారేజ్ లో కూడా సమంత అంత ఇంపార్టెంట్ ఉన్న రోల్ కాదనే చెప్పాలి. మరి ఇన్ని చేస్తున్న సమంత అలానే కెరియర్ కొనసాగించక ఈ అనవసరపు మాటలెందుకో అంటున్నారు. 
కోలీవుడ్ ధనుష్ హీరోగా వెట్రిమారన్ డైరక్షన్లో 'వాడా చెన్నై' సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న సమంత ఆ సినిమా నుండి బయటకు వచ్చేసింది. అయితే సినిమా  హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఆ టైంలో అమ్మడు అలాంటి గొప్ప సినిమాలో ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ కబుర్లు చెప్పింది మరి ఇప్పుడేమో ఇలా ప్లేట్ మార్చేసి హీరోయిన్స్ కు మంచి పాత్రలు రావట్లేదు అంటూ కథలు చెబుతుంది. చేసే పనులతో మంచి పేరు తెచ్చుకుంటున్న సమంత ఇలా అనవసరంగా మాట్లాడి వచ్చిన మంచి పేరుని కాస్త చెడగొట్టుకోవడం ఆమె ఫ్యాన్స్ కు నచ్చట్లేదు.