
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి హీరో కళ్యాణ్ రాం కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇజం. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా మీద అంచనాలను ఏర్పడేలా చేసిన పూరి సినిమాను కూడా చాలా కేర్ ఫుల్ గా తీసున్నాడట. లాస్ట్ ఇయర్ తీసిన మూడు సినిమాల్లో టెంపర్ తప్పించి మిగతా జ్యోతిలక్ష్మి, లోఫర్ ఫ్లాప్ అవ్వడంతో ఇజంతో ఎలాగైనా హిట్ కొట్టి తన కసి తీర్చుకోవాలని అనుకుంటున్నాడు పూరి. కళ్యాణ్ రాం కూడా సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు.
పూరితో సినిమా అంటే ఓ పిక్ నిక్ లా ఉందంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్న కళ్యాణ్ రాం ఈ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకోబోతున్నట్టు కనిపిస్తుంది. అయితే పోస్టర్, టీజర్ సినిమాపై హోప్స్ పెరిగేలా చేసిన దసరా బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇజం మూవీని దసరా తర్వాతకు పోస్ట్ పోన్ చేస్తున్నారట. అయితే అనుకున్న టైంకు షూటింగ్ పూర్తవలేదు కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారు కాబట్టే సినిమా దసరా రిలీజ్ కష్టం అని కొందరి వాదన.
ఏది ఏమైనా సరే ఈ మధ్య సినిమాలన్ని ఒకేసారి వచ్చి పడిపోకుండా ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యి మంచి ఫలితాలను సాదిస్తున్నాయి. మరి కావాలని పోస్ట్ పోన్ చేసినా లేక వాయిదా వేయాల్సి వచ్చినా సినిమా హిట్ తో ఈ గ్యాప్ ను కవర్ చేయాలని చూస్తున్నారు పూరి కళ్యాణ్ లు.. మరి వారిద్దరైతే సినిమా హిట్ అని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఈ నెల 19న ఆడియో రిలీజ్ అవనున్న సందర్భంగా అఫిషియల్ గా రిలీజ్ డేట్ ఆరోజే ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.