అఖిల్ సినిమాలో మళయాళ సూపర్ స్టార్..?

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరచాయి. అందుకే బ్యాచ్ లర్ సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తారని టాక్. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఆయనతో చేయించాలని ప్రయత్నిస్తున్నారట. కథ విన్న మళయాళ స్టార్ ఓకే చెప్పినట్టు టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు వస్తాయి.