రెండోది కాదు మూడోది లైన్లో పెడుతున ్న అఖిల్..!

మొదటి సినిమా ఫ్లాప్ తో ఏడాది పాటు ఖాళీగా ఉన్న అఖిల్ ఇప్పుడు వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మనం డైరక్టర్ విక్రం కె కుమార్ డైరక్షన్లో ఓ సినిమా కమిట్ అయిన అఖిల్ ఆ తర్వాత సినిమా దర్శకుడిని ఫైనల్ చేశాడట. ఈరోజుల్లో సినిమా నుండి రీసెంట్ గా రిలీజై ప్రేక్షకాదరణ పొందిన బాబు బంగారం దాకా తన సినిమాకో బ్రాండ్ వాల్యూ వచ్చేలా చేసుకున్న మారుతి ఈ అఖిల్ మూడో సినిమా డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.

ఇప్పటికే నాగార్జున అఖిల్ ఇద్దరికి మారుతి కథ వినిపించాడట. కథ కూడా నచ్చడంతో మారుతికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అసలైతే విక్రం సినిమాకు ముందే ఈ సినిమా చేద్దామనుకున్నా మొదటి సినిమా ఫ్లాప్ భారాన్ని విక్రం సినిమాతో కడిగేయాలనే ఉద్దేశంతో నాగ్ విక్రంతో అఖిల్ సినిమా ప్లాన్ చేశాడు. సో అఖిల్ థర్డ్ మూవీ మారుతి దర్శకత్వంలో అని ఫిక్స్ అయిపోవచ్చు.

అఖిల్ విక్రం సినిమా చేసేలోగా మారుతి హవీష్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే అది తన డైరక్షన్లో కాదు తన అసోసియేట్ లో ఒకరిని డైరక్టర్ గా పెట్టి ఆ సినిమా తీస్తున్నాడట మారుతి. అంతేకాదు ఆ సినిమా నిర్మాణ భాధ్యతలను కూడా మారుతి తన మీద పెట్టుకున్నాడట. మారుతి, అఖిల్ క్రేజీ కాంబినేషన్ గా తెరకెక్కే ఆ సినిమా ఎప్పుడు ముహుర్తం కుదురుతుందో చూడాలి.